ఈ 24న రొమాంటిక్ స్పైసి ఎంటర్ టైనర్ మూవీ “ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు”

romantic spicy entertainer eppatlo ramudila yevar untar ra babu to hit screens on november24
లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు. మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈ 24న ప్రేక్షకుల ముందుకు వసుంది. ఈ సందర్బంగా నిర్మాత ప్రశ్నాద్ తాతా  మాట్లాడుతూ… ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటారో అదే ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. ఈ చిత్రానికి గానూ కొత్త విలన్ ను పరిచయం చేయడం జరుగుతోంది. ఇప్పుడు వస్తున్న వెజిటేరియన్ సినిమాల మధ్యలో మా సినిమా ఒక నాన్ వెజిటేరియన్ గా వస్తోంది అని చెప్పగలను. కథ  కథనాలకు  ప్రాధాన్యత ఉన్న   మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నా.  అలానే ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా  కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అన్నారు.   దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ ఈ చిత్రం కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.  వైజాగ్, నెల్లూరు తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల చేస్తున్నాము.  మాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి
 కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అన్నారు.  ఈ చిత్రం లో మెయిన్ రోల్ లో చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో చిత్ర కథాంశం కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది, అన్ని పాత్రలకు సమానమైన  ఇంపార్టెంట్స్ ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నటించే  అవకాశం వచ్చింనందుకు సంతోషంగా ఫీల్ అవుతున్న అదేవిదంగా  ఈ సినిమాలో నటించిన   మరో హీరో ప్రశాంత్ ఇటీవలే మరణించడం  బాధాకరమైన విషయం అని తెలిపారు హీరో  మహీధర్.  హీరోయిన్ ఇషిత మాట్లాడుతూ కొత్త వారు అందులోనూ భాష సమస్య  ఉంటుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏమాత్రం చూపించకుండా నన్ను  సపోర్ట్ చేసిన  దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలని తెలియచేసారు. అని అన్నారు.   నటుడు బాబు మాట్లాడుతూ టైటిల్ ఎంత డిఫరెంట్  గా ఉంటుందో  సినిమా కూడా అంతే డిఫరెంట్ గా ఉండి  అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.
మహీధర్, ఇషిత, ప్రశాంత్, లలిత, రామ్ జగన్, వైభవ్ సూర్య, జబర్దస్త్  భాస్కర్, తరణి, కిరణ్, బాబు తులసి, నందిని, మధు, జిఎస్ ఆర్, పవన్, రాధాకృష్ణ తీరుమాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ. జగన్, పాటలు: చైతన రాపేటి, సంగీతం: రామేష్ డి. రీ రికార్డింగ్: డా. జోశ్యభట్ల, ఎడిటింగ్: సత్య గిడుతూరి, స్టిల్స్: మోహన్ బాబు.ఎం, గ్రాఫిక్స్: ఇంద్ర, ఫైట్స్: అహమ్మెద్, డాన్స్: జోజో, నిర్మాత: ప్రశ్నాద్ తాతా, రచన- దర్శకత్వం: వెంకటేష్.కె.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here