ఈ సారి పిట్ట ఔట్.. నూతన్ కూడా..!

బిగ్ బాస్.. ఇక్క‌డ ఏదైనా జ‌ర‌గొచ్చు. రీ ఎంట్రీ అంటూ ఒక్క‌రు కాదు ఇద్ద‌ర్ని ఇంట్లోకి పంపించిన‌పుడు ఒకేవారం ఇద్ద‌ర్ని బ‌య‌టికి పంపించ‌డం పెద్ద లెక్కేం కాదు క‌దా..! ఈ వారం ఇదే జ‌ర‌గ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్ప‌టికే వైల్డ్ కార్డ్ లో వ‌చ్చిన నూత‌న్ నాయుడు చేయికి దెబ్బ‌త‌గిలి ఇంటిని వ‌దిలేసి బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఈయ‌న మ‌ళ్లీ రావ‌చ్చు.. రాక‌పోవ‌చ్చు అని నానినే చెప్పాడు.

DEEPTHI SUNAINA NUTAN NAIDU

వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం ఈయ‌న ఇంటికి మ‌ళ్లీ రాక‌పోవ‌చ్చు అనేది తెలుస్తుంది. పైగా ఈ సారి ఎలిమినేష‌న్స్ లిస్ట్ లో మొద‌టి పేరు కూడా నూతన్ దే ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో ఆయ‌నకు దెబ్బ త‌గ‌ల‌డంతో ఇంక అట్నుంచి అటే పంపించేయాల‌ని ఫిక్సైపోయారు.

దానికితోడు ఆయ‌న‌తో పాటు ఈ వారం దీప్తి సునైనా కూడా ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇన్నాళ్ళూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో ఎలాగో లాగించేసిన దీప్తికి ఇప్పుడు చుక్క‌లు మొద‌ల‌య్యాయి. గేమ్ ఒక్కో వారం గ‌డుస్తుంటే అమ్మాయిగారికి అస‌లు డ్రామా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఈ వారం శ్యామ‌ల‌.. గీత సేవ్ కావ‌డంతో ఇప్పుడు రోల్ రైడాతో పాటు దీప్తి సునైనా కూడా ఎలిమినేష‌న్ లిస్ట్ లోనే ఉన్నారు. వీళ్ల‌లో రోల్ సేఫ్ అయి.. దీప్తి బ‌య‌టికి వ‌చ్చేస్తుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ వారం ఏం జ‌ర‌గబోతుందో అనే టెన్ష‌న్ అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here