ఈ వారం కూడా గీత‌గోవింద‌మే.. ఏం సుడి రాజా…?

ఓ సినిమా హిట్ అయిందంటే తెలియ‌కుడానే దానికి మిగిలిన సినిమాలు కూడా స‌పోర్ట్ చేస్తుంటాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇది ఎప్పుడూ జ‌రుగుతుంటుంది. ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా వ‌చ్చిందంటే ఎందుకో తెలియ‌దు కానీ ఆ త‌ర్వాత వ‌చ్చే ఏ సినిమా కూడా ఆ స్థాయిలో ఉండ‌దు. అన్నీ క‌ట్ట‌గ‌ట్టుకుని మ‌రీ ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు గీత‌గోవిందం విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌లైంది. ఇప్ప‌టికి వ‌చ్చి 16 రోజులు దాటిపోయింది. ఈ రెండు వారాల్లో అర‌డ‌జ‌న్ సినిమాలు వ‌చ్చాయి.

GEETHA GOVINDAM

కానీ ఒక్క‌టి కూడా హిట్ కాలేదు.. ఏ ఒక్క‌టీ గీత‌గోవిందం జోరుకు బ్రేకులు వేయ‌లేదు. గ‌తవారం ఆట‌గాళ్లు.. నీవెవరో.. ల‌క్ష్మి.. అంత‌కుమించి.. ఈ వారం న‌ర్త‌న‌శాల‌.. పేప‌ర్ బాయ్.. న‌య‌న‌తార కోకో ఇలా ప్ర‌తీ సినిమా రావ‌డం పోవ‌డం జ‌రిగింది కానీ ఒక్క‌టి కూడా నిల‌బ‌డ‌లేదు. దాంతో ఈ వారం కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ పేరుపై వెళ్లిపోనుంది. సెప్టెంబ‌ర్ 13న శైల‌జారెడ్డి అల్లుడు వ‌చ్చేవ‌ర‌కు తెలుగులో మంచి సినిమాలు లేవు. అంటే మ‌రో రెండు వారాల వ‌ర‌కు కూడా గీత‌గోవిందం త‌ప్ప ప్రేక్ష‌కుల‌కు మ‌రో ఆప్ష‌న్ లేదు. ఇప్ప‌టికే 60 కోట్ల షేర్ కు చేరువ‌గా వ‌చ్చిన ఈ చిత్రం అన్నీ క‌లిసొస్తే 65 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. సుడి అంటే ఇలా ఉండాలి రాజా.. ప్ర‌తీ ఒక్క‌రూ చూసి కుళ్లుకునేలా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here