ఇద్దరి మధ్య 18 రివ్యూ

MOVIE METER

Average Rating: 2
Total Critics: 2

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఇంట్లో ఉంటె ప్రశాంతంగా ఉంటుంది

Rating: 1.5/5

http://www.teluguodu.com

ఇద్దరి మధ్య 18 – కొత్తదనమంటూ ఏం లేదు

Rating: 2/5

http://www.123telugu.com

Release Date : 04/21/2017

నటులు : రామ్ కార్తీక్, భాను
డైరెక్టర్ : నాని ఆచార్యా
సంగీతం : గంటాది కృష్ణ
నిర్మాత : శివరాజ్ పాటిల్

కథ :

మహి మరియు హిమ ఇద్దరూ విద్యార్థులు. వీరి ఇద్దరూ తన తోటి విద్యార్థులతో పాటుగా అరకు ఇండస్ట్రియల్ టూర్ కు వెళ్లడం జరుగుతుంది. వీరిద్దరూ ఇక్కడ ప్రేమలో పడడం జరుగుతుంది. మహి మరియు హిమ ఇద్దరినీ కలిపి ప్రాజెక్టు 18 అనే దానిలో వేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ దేశ భద్రతకు సంబందించినది. ఇద్దరూ ఈ విషయంలోనూ మరియు తమ ప్రేమ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య వీరిద్దరు ప్రాజెక్ట్ 18 ని పూర్తి చేస్తారా ? వీరి ప్రేమను గెలుచుకుంటారా ? చివరకు ఏమి జరుగుతుంది ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెరమీద ఇద్దరి మధ్య 18 సినిమా చూడాల్సిందే !

 

సమీక్ష :

విప్లవ భావాలకు మరియు ప్రేమకు అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇద్దరి మధ్యలో 18. సమాజానికి ఒక మంచి మెసేజ్ తో సినిమా తెరకెక్కించడం జరిగింది. మంచి ఆలోచనతో సినిమా చేసినప్పటికి సినిమాకు అందించిన స్క్రీన్ ప్లే సినిమా రూపునే మార్చివేసిందని చెప్పాలి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా ఉంది సినిమా పరిస్ధితి. సన్నివేశాలను సరిగా రాయకపోవడం ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఓపికను పరీక్షిస్తుంది.

సినిమా మొదటి భాగం ఎంతో సేపు నడిచినట్టు ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తో ప్రేక్షకులు కాస్త సేదతీరినట్టు అనిపించినప్పటికీ రెండవ భాగంతో మరల తలనొప్పి రావడం మొదలవుతుంది. రాసిన కథ మరియు దర్శకుడి దర్శకత్వ ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు థియేటర్ లలో చుక్కలు చూపిస్తాయి. డైలాగులు సిల్లీగా ఉండటమే కాకుండా మరల మరల రిపీట్ చేయడంతో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బిత్తిరి సత్తి తన మార్క్ డైలాగులతో అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేయడం మంచి విషయం. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమి లేవి.

బాగున్నవి :

సోషల్ మెసేజ్

బాగాలేవిని :

దర్శకత్వం
స్క్రీన్ ప్లే

మొత్తం మీద : ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది