ఇది మెగా భ‌జ‌న సంఘం..!

ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ హీరోకు అభిమానులు ఉంటారు. సీనియ‌ర్ హీరోలంద‌రికీ సెలెబ్రెటీస్ లో కూడా చాల మంది ఫ్యాన్స్ ఉంటారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా త‌మ అభిమాన హీరో ఇత‌డే అని చెప్పుకుంటారు. ఆ లిస్ట్ లో అంద‌రికంటే ముందు చిరంజీవి ఉంటాడు. ఈయ‌న‌కు ఈ త‌రం ద‌ర్శ‌కులంతా అభిమానులే. ఎక్క‌డ ఏ వేడుక జ‌రిగినా కూడా చిరంజీవిని పొగ‌డ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు కొంద‌రు ద‌ర్శ‌కులు. త‌మ స్థాయిని కూడా మ‌రిచి పోయి మెగా భ‌జ‌న‌లో మునిగిపోతున్నారు. హ‌రీష్ శంక‌ర్ నే తీసుకోండి.. ఈయ‌న స్టార్ డైరెక్ట‌రే. కానీ చిరంజీవిని చూసినా.. మెగా హీరోలు కంట ప‌డినా ఈయ‌న నోరు అదుపులో ఉండ‌దు.

మైక్ చేతిలో ఉంటే మున‌గ‌చెట్టు కాదు.. ఏకంగా ఎవ‌రెస్టులే ఎక్కించేస్తుంటాడు. అక్క‌డ్నుంచి కింద ప‌డుతున్నాం బాబోయ్ అంటూ మెగా హీరోలు అంటున్నా కూడా వ‌ద‌ల‌డు. తేజ్ ఐ ల‌వ్ యూ ఆడియో వేడుక‌లో చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న్ని చూసి చాలా మంది జీవితాలు కూడా బాగుప‌డ్డాయ‌ని.. ఆయ‌న లాంటి హీరో ఉండ‌టం మ‌న అదృష్టం అని ఓ రేంజ్ లో చిరు జ‌పం చేసేసాడు. అది చూసే వాళ్ల‌కు కాస్త ఎబ్బెట్టుగా కూడా అనిపించింది. అందులో నిజాలు ఉన్నాయా లేవా అనేది ప‌క్క‌న‌బెడితే ఓ హీరోను మ‌రీ అంత‌గా పొగ‌డాల్సిన అవ‌స‌రం అయితే లేదు. కానీ హ‌రీష్ మాత్రం విన‌డు.

ఈయ‌న‌తో పాటు బివిఎస్ ర‌వి కూడా చిరును ఓ రేంజ్ లో పొగిడేసాడు. అస‌లు త‌ను అప్ప‌ట్లో చిరంజీవి సినిమాలు చూడ‌టం వ‌ల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటూ గొప్ప‌ల‌కు పోయాడు. ఈ ద‌ర్శ‌కులు మాత్ర‌మే కాదు.. మైక్ దొరికితే చాలు త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కులు కూడా మెగా భ‌జ‌న చేస్తుంటారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అయితే త్రివిక్ర‌మ్ మామూలుగా పొగ‌డ‌డు. ఈయ‌న మాట‌లు వింటుంటే ప‌వ‌న్ దేవుడే అని ఫిక్సైపోవాలి.

అలా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మెగా భ‌జ‌న సంఘాలు బాగానే వ‌చ్చేసాయి. ఆ హీరోలేం ప‌ని చేసినా కూడా తాన తందానా అంటూ తెగ డ‌ప్పు కొడుతున్నారు. కొట్టించుకున్న వాళ్ల‌కు.. కొట్టే వాళ్ల‌కు బాగానే ఉంటుంది కానీ వినే వాళ్ల ప‌రిస్థితి మాత్రం కాస్త అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. మ‌రి ఈ భ‌జ‌న సంఘాలు ఎప్ప‌టికి చ‌ల్ల‌బ‌డ‌తాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here