ఇంట్లో దయ్యం నాకేం బయ్యం రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 2

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మసాలా హారర్ కామెడీ సినిమా

Rating: 2.75/5

http://www.teluguodu.com/

కామెడీ బాగుంది కానీ సినిమా రొటీన్ గా ఉంది

Rating: 2.75/5

http://www.123telugu.com/

Release Date : 12/30/2016

నటులు: అల్లరి నరేష్ , కృతిక జయకుమార్ , మౌర్యాని
డైరెక్టర్ : నాగేశ్వర్ రెడ్డి
సంగీతం: సాయి కార్తిక్
నిర్మాత : బి వి యెన్ స్ ప్రసాద్
కథ :
మ్యూజిక్ బ్యాండ్ కు నాయకుడిగా ఉంటాడు అల్లరి నరేష్. అనాధ పిల్లలని చూసుకొనే కృతికాను చూసి మనోడు ప్రేమలో పడతాడు. ఒకానొక రోజు ఆ అనాధ పిల్లలో ఒకరికి ఆరోగ్య సమస్యల వలన వైద్యం నిమిత్తం ఎక్కువ మొత్తం లో డబ్బు అవసరం అవుతుంది. అప్పు తీసుకొని వస్తున్న డబ్బు దొంగతనానికి గురి అవుతుంది. ఇప్పుడు అప్పు తీర్చడానికి మరియు పిల్లాడి వైద్యానికి రెండిటికి డబ్బులు కావాలి. అయితే అనుకోకుండా మనోడికి దయ్యం వదిలించమని ఒక కాల్ పొరపాటున వస్తుంది. పెళ్లి తంతు జరగకుండా అడ్డుపడే ఆ దయ్యం వదిలింక్చడానికి మనోడు రంగంలోకి దిగుతాడు. కొంత డబ్బు ముందే తీసుకొని పిల్లాడి వైద్యానికి కట్టేస్తాడు. అయితే ఆ దయ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు , ఆ దయ్యం ఎవరో కాదు తనం మనరాదులు అని ….! ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య ఆ దయ్యం ఎవరు ? ఆమెకు ఏమవుతుంది ? ఆమె కోర్కెలను నరేష్ ఎలా తీరుస్తాడు ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెర మీద ఇంట్లో దయ్యం నాకేం బయ్యం సినిమా చూడాల్సిందే ..!

సమీక్ష :
ఎప్పటిలాగే దయ్యం అంటే ఒక ఇంట్లో ఉంది అందరినీ ఇబ్బంది పెద్దదం , శబ్దాలు చేయడం మరియు చివరికి దయ్యం కోరిక తీర్చడం ఇలాగే ఉంది ఈ సినిమా కూడా. అయితే ఇక్కడ లాజిక్ లు ఆలోచించకుండా కాస్త కామెడీ మీద ధ్యాసపెట్టాలి అనేలా ఉంది సినిమా. అల్లరి నరేష్ సినిమా లో అది థ్రిల్లర్ అయినా కామెడీ మూవీ లగే ఉంటుంది మరి. అన్ని రకాల మసాలాలు కలయికతో మంచి మాస్ ఎంటర్టైనర్ గా ఉంది అనాలి మరి. కామెడీ సన్నివేశాలతో , డబల్ మీనింగ్ డయలాగులతో మరియు హీరోయిన్ గ్లామర్ టచ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. సినిమా మొదట్లో సదా సీదా కామెడీ సన్నివేశాలతో మొదలైనప్పటికీ తరువాత మంచి సన్నివేశాలతో పుంజుకుంటుంది.
సినిమా లోని పాత్రలను అక్కడక్కడా పరిచయం చేస్తూనే ఉంటారు అయితే రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుల నటన బాగుండడంతో సన్నివేశాలు రక్తి కట్టించాయి. అల్లరి నరేష్ అసిస్టెంట్ లలాగా షకలక శంకర్ మరియు చమ్మక్ చంద్ర కామెడీ కు చక్కగా సహకరించడంతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. కృతిక జయకుమార్ తన అందచందాల ప్రదర్శనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయితే డైరెక్టర్ ఇంకాస్త ప్రయత్నించి ఉంటె మంచి ఊపు ఉన్న ఈ సినిమా మరొక లంగా ఉండేది అని అభిప్రాయం. సాయి కార్తిక్ అందించిన సంగీతం పరవాలేదని అనిపించడం మరియు బాక్గ్రౌడ్ మ్యూజిక్ బాగా సెట్ అవ్వడం ఈ సినిమా కు మంచి విషయాలు.
బాగున్నవి :
కామెడీ
నటులు
నిర్మాణ విలువలు
బాగాలేనివి :
కొన్ని సన్నివేశాలు
మొత్తం మీద : మసాలా హారర్ కామెడీ సినిమా