ఇంకెప్పుడు చెప్తావ్ బ‌న్నీ..?

ఈ రోజుల్లో హీరోలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు..? ఓ సినిమా పూర్తి కాగానే మ‌రో రెండు మూడు సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఎన్టీఆర్.. చ‌ర‌ణ్.. ప్ర‌భాస్.. మ‌హేశ్.. ఇలా ఎవ‌ర్ని తీసుకున్నా కూడా ఇప్పుడు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. చివ‌రికి చిరంజీవి లాంటి సీనియ‌ర్ హీరో కూడా ఓ సినిమా పూర్తి కాక‌ముందే మ‌రో రెండు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు.

కానీ అల్లుఅర్జున్ మాత్రం ఇప్ప‌టికీ నెక్ట్స్ ఏంటో తేల్చుకోలేక‌పోతున్నాడు. ఈ మ‌ధ్యే నా పేరు సూర్య‌తో వ‌చ్చాడు. కానీ అది అంచ‌నాలు అందుకోలేదు దాంతో త‌ర్వాతి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఈ సారి ఏ ప్ర‌యోగాలు లేకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ ఒక‌టి సిద్ధం చేయాల్సిందిగా త‌న ద‌గ్గ‌రికి వ‌స్తున్న ద‌ర్శ‌కుల‌కు చెబుతున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే విక్ర‌మ్ కే కుమార్ చెప్పిన క‌థ ఒక‌టి న‌చ్చింద‌ని తెలుస్తుంది.

దాంతోపాటు కొర‌టాల శివ అన్నారు కానీ అది ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఇంకొంత కాలం బ‌న్నీ వేచి చూసేలా క‌నిపిస్తున్నాడు కానీ ఇప్ప‌ట్లో మాత్రం త‌ర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చేలా మాత్రం లేడు. మ‌రి చూడాలిక‌.. సూర్య ఇచ్చిన షాక్ నుంచి బ‌న్నీ ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here