అ.. మిస్ట‌రీ వీడ‌బోతుంది..!


మా సినిమా చాలా కొత్త‌గా ఉంటుంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ‌తో ఏ సినిమా రాలేదు.. అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ సినిమాల గురించి చెబుతుంటే కాస్త వింత‌గా.. ఓవ‌ర్ గా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మాది కొత్త క‌థ అని చెప్పుకునే ధైర్యం కూడా ఎవ‌రూ చేయ‌ట్లేదు. కానీ నాని మాత్రం చేస్తున్నాడు.. చెబుతున్నాడు. ఈయ‌న హీరోగా చేస్తోన్న సినిమా కాదు కానీ నిర్మాతగా మారి చేస్తోన్న సినిమాను మాత్రం బాగానే ప్ర‌మోట్ చేస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఆ సినిమానే అ..! టైటిల్ తోనే అంద‌ర్నీ ప‌డేసాడు నాని. ఇక ఈ చిత్రంలోని ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు కూడా సినిమాపై ఆసక్తి బాగా పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఇలాంటి చిత్రం రాలేదంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. రెగ్యుల‌ర్ ప్రొడ్యూస‌ర్లు అయితే ఈ క‌థ‌ను చేయ‌రు కాబ‌ట్టే తానే నిర్మాత‌గా మారానంటున్నాడు నాని.
అస‌లు అ.. సినిమాలో ఏముందో తెలియ‌క ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై రాని క‌థ అంటే ఏదో కొత్త‌గా ఉంటుంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. పైగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్స్ కూడా సినిమాపై ఆస‌క్తి రెండింత‌లు చేస్తున్నాయి. ఇందులో నాని చేప‌గా.. ర‌వితేజ చెట్టుగా న‌టిస్తున్నారు. ఈ లుక్స్ కూడా ఇప్ప‌టికే విడుద‌లయ్యాయి. ఇక రెజీనా విల‌న్ గా.. శ్రీ‌నివాస్ అస‌వ‌రాల ఏదో సైంటిస్ట్ గా.. నిత్యా మీన‌న్ ల‌వ‌బుల్ పాత్ర‌లో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా న‌టిస్తున్నారు. ఈ మ‌ధ్యే కాజ‌ల్ లుక్ విడుదలైంది. అస‌లు అ.. వెన‌క ఉన్న మిస్ట‌రీ ఏంటో జ‌న‌వ‌రి 4 సాయంత్రం 5 గంట‌ల‌కు తేల‌నుంది. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ టీజ‌ర్ తో అయినా అస‌లు నాని ఏం చెప్పాల‌నుకుంటున్నాడో.. ఏం చెబుతున్నాడో కాస్త క్లారిటీ వ‌స్తుంది. 2018 ఫిబ్ర‌వ‌రిలో అ..! చిత్రం విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *