అవి వ‌సూళ్లా.. రిజ‌ర్వ్ బ్యాంక్ లెక్క‌లా..?


ఇప్పుడు అవేంజ‌ర్స్ సినిమాకు వ‌స్తున్న క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత ఇంత‌కంటే మంచి ఉదాహ‌ర‌ణ దొర‌క‌డం లేదు. ఒక్క‌టి రెండు కాదు.. 10 రోజుల్లో ఏకంగా 6600 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు అవేంజ‌ర్స్ ఫీవ‌ర్ న‌డుస్తుంది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా అనే తేడాలేం లేవు..
అన్ని దేశాల్ని మ‌డ‌త పెట్టేస్తున్నారు అవేంజ‌ర్స్. ఈ సూప‌ర్ హీరోస్ దెబ్బ‌కు వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్ష‌రాలా 6660 కోట్లు వ‌సూలు చేసి.. బ్లాక్ పాంథ‌ర్ పేరు మీదున్న రికార్డుల‌న్ని తుడిచేసింది అవేంజ‌ర్స్. ఈ చిత్రం దెబ్బ‌కు ఇండియ‌న్ బాక్సాఫీస్ కూడా కుదేలైపోతుంది. తొలిరోజు నుంచే ర‌చ్చ మొద‌లైంది. ఇప్ప‌టికే 200 కోట్ల గ్రాస్.. 150 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూలు చేసింది అవేంజ‌ర్స్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హాలీవుడ్ సినిమాకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. కొన్నేళ్ల‌లో అవ‌తార్.. 2012..
ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 7.. జురాసిక్ వ‌ర‌ల్డ్.. జంగిల్ బుక్ లాంటి హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడు అవేంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంట‌ల్ వ‌చ్చేస్తుంది. అవేంజ‌ర్స్ దెబ్బ‌కు భ‌ర‌త్ అనే నేనుతో పాటు నా పేరు సూర్య‌ క‌లెక్ష‌న్లకు భారీ గండి ప‌డింది. మ‌ల్టీప్లెక్సుల్లో ఈ చిత్రం అరాచ‌కం అలా ఉంది మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here