అల‌క‌పాన్పు ఇంకా దిగ‌ని నాగ‌శౌర్య‌..

సాధార‌ణంగా కొత్త అల్లుళ్లు అల‌క‌పాన్పులు ఎక్కుతుంటారు. బామ్మ‌ర్దులు వ‌చ్చి వాళ్ల‌ను స‌ముదాయిస్తుంటారు. కానీ ఇప్పుడు ఇక్క‌డ నాగ‌శౌర్య ఈ ప‌ని చేస్తున్నాడు. కాక‌పోతే బామ్మ‌ర్దులు మాత్రం ఎవ‌రూ క‌నిపించ‌ట్లేదు. అస‌లు విష‌యం ఏంటంటే నాగ‌శౌర్య ఈ మ‌ధ్యే క‌ణం సినిమాతో తమిళ ఇండ‌స్ట్రీకి కూడా ప‌రిచ‌యం అయ్యాడు.

ఈ సినిమా ఎప్రిల్ 27న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చాలా తేదీలు మార్చుకుని చివ‌రికి కాలా వ‌దిలేసిన డేట్ ప‌ట్టుకున్నారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ కు కేవ‌లం సాయిప‌ల్ల‌వి మాత్ర‌మే వ‌స్తుంది. నాగ‌శౌర్య రావ‌డం లేదు. ఆ మ‌ధ్య హైద‌రాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు కూడా శౌర్య రాలేదు. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్..

హీరోయిన్ సాయిప‌ల్ల‌వితో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ఎన్వీ ప్ర‌సాద్, బివిఎస్ఎన్ ప్ర‌సాద్, జెమినీ కిర‌ణ్ లాంటి ప్ర‌ముఖులు వ‌చ్చారు. కానీ హీరో నాగ‌శౌర్య మాత్రం ఈ వేడుక‌లో క‌నిపించ‌లేదు. దానికి కార‌ణం కూడా సాయిప‌ల్ల‌వే. అవును.. ఆ మ‌ధ్య ప‌ల్ల‌విపై ఓపెన్ గానే సెటైర్లు వేసాడు ఈ హీరో. త‌న‌కు సాయిప‌ల్ల‌వి తీరు న‌చ్చ‌లేద‌ని..

ఆమె త‌మ‌కు చుక్క‌లు చూపించింద‌ని చెప్పాడు శౌర్య‌. ఈయ‌న మాట ల‌కు హ‌ర్ట్ అయి సాయిప‌ల్ల‌వే తెలుగులో క‌ణం సినిమాను ప్ర‌మోట్ చేయ‌దేమో అనుకున్నారంతా కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ప‌ల్ల‌వే ఈ సినిమా ప్ర‌మోష‌న్ కు వ‌స్తుంది.. నాగ‌శౌర్య రావ‌ట్లేదు. ఇదే ఇప్పుడు హాట్ న్యూస్. కేవ‌లం ప్రీ రిలీజ్ కు మాత్ర‌మే ఎగ్గొట్టాడేమో అనుకుంటే ఇప్పుడు ప్ర‌మోష‌న్ కు కూడా రావ‌ట్లేదు ఈ హీరో. తాజాగా ప‌ల్ల‌వి మాత్ర‌మే క‌ణం సినిమాను భుజాన వేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here