అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కేరాఫ్ అప‌రిచితుడు..

విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించానా కూడా ఇదే నిజం అంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఈ చిత్రం ఎలాంటి క‌థ‌తో వ‌స్తుంద‌బ్బా అనే ఆస‌క్తి అంద‌రి లోనూ క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా అప్ప‌ట్లో శంక‌ర్ చేసిన అప‌రిచితుడు త‌ర‌హాలో ఉంటుంద‌ని తెలుస్తుంది. అంటే క‌థ అద‌ని కాదు.. ఇందులో హీరోకు ఇలాంటి స‌మ‌స్యే ఉంటుంద‌న్న‌మాట‌. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో ర‌వితేజ మ‌ల్టిపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ తో బాధ ప‌డుతుంటాడు. అందుకే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీగా మారిపోతుంటాడ‌ని తెలుస్తుంది. శీనువైట్ల ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.

ఒక‌ప్పుడు ఈయ‌న సినిమా అంటే ఒక‌ప్పుడు ఉన్న అంచ‌నాలు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం కూడా అవ‌స‌రం లేదు. ఆగ‌డు.. బ్రూస్లీ.. మిస్ట‌ర్ సినిమాల‌ను చూపిస్తే చాలు. దానికి ముందు బాద్షా కూడా పెద్ద హిట్ ఏం కాదు. జ‌స్ట్ యావ‌రేజ్. దూకుడుతో ఒక్క‌సారిగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయిన శీనువైట్ల‌.. ఆ త‌ర్వాత మాత్రం అంచ‌నాలు అందుకోలేక వ‌ర‌స‌గా చ‌తికిల‌ప‌డుతూనే ఉన్నాడు.

మిస్ట‌ర్ త‌ర్వాత ఈయ‌న జాత‌కం పూర్తిగా తిర‌గ‌బ‌డిపోయింది. దాంతో మ‌ళ్లీ త‌న కెరీర్ ను గాడిన పెట్టుకోడానికి ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అంటూ వ‌స్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే శీనువైట్ల పూర్తిగా మారిపోయిన‌ట్లే అనిపిస్తుంది.
ఎందుకంటే ఇదివ‌ర‌కటి మాదిరి రొటీన్ గా అయితే లేదు ఫ‌స్ట్ లుక్. ఒకే పోస్ట‌ర్ లో ముగ్గురు ర‌వితేజ‌ల‌ను చూపిస్తూ కావాల్సినంత క్యూరియాసిటీ పెంచుతున్నాడు శీనువైట్ల‌. ఒక్క‌డే ముగ్గురు ఎందుకు అయ్యాడు అనేది థియేట‌ర్ కి వ‌చ్చి తెలుసుకోండి అంటున్నాడు. పైగా ఈ చిత్రంలో సునీల్ ఉన్నాడు.

వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ వ‌స్తుంది. ఇప్ప‌టికైతే ఫ‌స్ట్ లుక్ తోనే సినిమాపై ఆస‌క్తి అయితే పెంచేసాడు. మ‌రి ఇదే ఊపు త‌ర్వాత కూడా కొన‌సాగుతుందా.. సినిమాలోనూ ఇంతే మ్యాట‌ర్ ఉంటుందా లేదా అనేది అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు ఆగితే తెలుస్తుంది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here