అప్పట్లో ఒకడుండేవాడు రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఇప్పట్లో చూడచ్చు

Rating: 2.5/5

http://www.teluguodu.com/

Release Date : 12/30/2016

నటులు : నారా రోహిత్ , శ్రీ విష్ణు , తాన్యా హోప్ , రాజీవ్ కనకాల
డైరెక్టర్ : సాగర్ కే చంద్ర
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : ప్రశాంత్ , కృష్ణ విజయ్
కథ :
మహాభారతం లోని దుర్యోధన పాత్రను చూసి అలాగే ఉండాలనే పాత్రలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇంతియాజ్ అలీ పాత్రలో నారా రోహిత్ కనిపిస్తాడు. తన రూల్స్ తాను ఫాలో అవుతుంటాడు. మరోపక్క రైల్వే రాజు మంచి క్రికెటర్ గా రాణిస్తుంటాడు. ఇండియన్ క్రికెట్ టీం లో మంచి స్తానం సంపాయించాలని కోరుకుంటాడు అయితే విధి అతనిని ఒక నేరగాడిని చేస్తుంది. తనను బలవంతంగా నేరచరిత్రలోకి నెత్తిన సమాజం మీద పగ తీర్చుకొనే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితులలో మనోడు ఇంతియాజ్ అలీ ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య రాజు తన పగ తీర్చుకుంటాడా ? ఇంతియాజ్ అలీ రాజు ను ఎలా ఎదుర్కొంటాడు ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెర మీద అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చూడాలసిందే !

సమీక్ష :
1990 వ సంవత్సరములో జరిగిన ఒక యదార్థ గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. యధార్థ గాధలను ఎక్కువగా తీసుతున్న ఈ సమయములో తెలుగు సినిమా నిర్మాతలు ఈ కథను తీసుకున్నందుకు తప్పక అభినందించాలి. సినిమా కు అందించిన స్క్రీన్ ప్లే అక్కడక్కడా చిన్న చిన్నవి తప్ప బాగానే ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. సినిమా మొదటి భాగం కాస్త స్లో గా నడిచినప్పటికీ ఇంటర్వెల్ తరువాత నుంచి మంచి ఊపందుకుంటుంది. సినిమా మొత్త్తం సినిమా లోని పాత్రల మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యన్గా నారా రోహిత్ మరియు శ్రీ విష్ణు ల మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులనియు మెప్పిస్తాయి.
కథలోని పాత్రలను పరిచయం చేయడం మరియు దానిని చివరి వరకు తీసుకురావడం లో డైరెక్టర్ విజయం సాధించాడు అని చెప్పాలి. సాయి కార్తిక్ అందించిన సంగీతం పెద్దగా ప్రభావం చూపనప్పటికీ పరవాలేదనిపించింది. ఇక తాన్యా హోప్ తన గ్లామర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది అని చెప్పవచ్చు. ముక్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ ను మరియు సినిమాటోగ్రఫీ యూనిట్ ను అప్పటి సెట్ చక్కగా వేసినందుకు మెచ్చుకోవాలి.
బాగున్నవి :
నారా రోహిత్ మరియు శ్రీ విష్ణు నటన
కథ
డయలాగులు
బాగాలేనివి :
మొదటి భాగం
కామెడీ లేకపోవడం
హీరోయిన్
మొత్తం మీద : ఇప్పట్లో చూడచ్చు