అనూప్ లైన్ లో ప‌డ్డ‌ట్లేనా..?

Anup Rubens is back on track with Hello
ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎప్పుడు ఎలా ట‌ర్న్ అవుతుందో తెలియ‌దు. అనూప్ రూబెన్స్ కూడా అంతే. ఈయ‌న ఎప్పుడు బిజీ అవుతాడో.. ఎప్పుడు ఖాళీ అయిపోతాడో ఎవ‌రికీ అర్థం కాదు. రెండేళ్ల కింద వ‌ర‌స సినిమాల‌తో దుమ్ములేపాడు అనూప్ రూబెన్స్. త‌క్కువ గ్యాప్ లోనే మ‌నం.. గోపాలా గోపాలా.. టెంప‌ర్ లాంటి సినిమాల‌తో క్రేజ్ తెచ్చుకున్నాడు. వ‌ర‌స‌గా స్టార్ హీరోల సినిమాల‌తో దుమ్ము లేపేసిన అనూప్ రూబెన్స్ స‌డ‌న్ గా ఎందుకు స్లో అయిపోయాడు..? స‌్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిపోతాడు అనుకున్న టైమ్ లో ఒక్క‌సారిగా ఇలా డౌన్ ఫాల్ లోకి ఎలా వెళ్లాడు..?  చేతిలో వ‌ర‌స సినిమాలున్న అనూప్.. ఇప్పుడు చిన్న సినిమాల‌కు ఎందుకు ఫిక్స‌య్యాడు..? అస‌లు ఏం జ‌రిగింది.. ? ఇలా ఎన్నో స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కుల్లో రేకెత్తాయి.
గోపాలా గోపాలా, టెంప‌ర్ త‌ర్వాత అనూప్ కెరీర్ ర‌య్ మ‌ని పైకి వెళ్తుంద‌నుకున్నారంతా. కానీ అలా జ‌ర‌గ‌లేదు. విచిత్రంగా రివ‌ర్స్ లో జ‌రిగింది. టెంప‌ర్ త‌ర్వాత అస‌లు అనూప్ పేరు పోస్ట‌ర్ పై క‌నిపించ‌డ‌మే మానేసింది. వ‌ర‌స‌గా థ‌మ‌న్, దేవీ, గోపీసుంద‌ర్ లాంటి సంగీత ద‌ర్శ‌కులే అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో అనూప్ కెరీర్ గాడిన ప‌డ‌టం అసాధ్యంగా క‌నిపించింది. ఇక ఈ మ‌ధ్యే వ‌చ్చిన కాట‌మ‌రాయుడు స‌క్సెస్ కాలేదు. పైగా పైసావ‌సూల్.. తేజ నేనేరాజు నేనేమంత్రి కూడా ఆడియో ప‌రంగా సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్స్ కాదు. ఇలాంటి స‌మ‌యంలో హ‌లో సినిమాతో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు అనూప్. ఈ చిత్రానికి ఈయ‌న అందించిన పాట‌లు బాగున్నాయి.
ఇప్పుడు సినిమా విడుద‌లైన త‌ర్వాత అనూప్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. మ‌నం త‌ర‌హాలో రొమాంటిక్ ట్యూన్స్ ఇచ్చాడు అనూప్ రూబెన్స్. ఇక సినిమాలోనూ అద్భుత‌మైన ఆర్ఆర్ ఇచ్చి నిల‌బెట్టాడు. చాలా చోట్ల అనూప్ సంగీతం మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అనూప్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ నే మార్చేసింది. మ‌నం, ఇష్క్ త‌ర్వాత విక్ర‌మ్ కే కుమార్ తో అనూప్ ప‌ని చేయ‌డం ఇది మూడోసారి. మ‌రి ఈ స‌క్సెస్ అయినా అనూప్ కెరీర్ ను మార్చేస్తుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here