అను ఎమ్మాన్యువ‌ల్.. ఎలిమినేట్ హ‌ర్ ఇమ్మీడియ‌ట్లీ..!

దూకుడు సినిమాలో బ్ర‌హ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు అను ఎమ్మాన్యువ‌ల్ ను చూసి ఇండ‌స్ట్రీలో కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఇదే అంటున్నారు. వ‌ర‌స ఫ్లాపుల‌తో ఫ్లాప్ క్వీన్ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. పాపం ఇందులో అను త‌ప్పేం ఉండ‌దు. ఆమె న‌టిస్తుంది అంతే.. కానీ ఇక్క‌డ ఇండ‌స్ట్రీలో మాత్రం ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డిపోయింది.

ANU-EMMANUEL

దానికి తాను కార‌ణం కాద‌ని తెలిసినా కూడా త‌ప్పు చేయ‌క‌పోయినా శిక్ష మాత్రం అనుభ‌వించాల్సిందే. అది ఇండ‌స్ట్రీలో రూల్.. ఒక‌ట్రెండు ఫ్లాపులు రాగానే ఆ హీరోయిన్ పై ఐరెన్ లెగ్ ముద్ర వేస్తుంటారు ద‌ర్శ‌కులు. ఇప్పుడు అను ఎమ్మాన్యువ‌ల్ కూడా ఈ క‌ష్టం త‌ప్ప‌ట్లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేదు ఈ భామ కెరీర్ లో. నానితో చేసిన మ‌జ్ను సినిమా యావ‌రేజ్.. ఆ త‌ర్వాత ఆక్సీజ‌న్.. అజ్ఞాత‌వాసి.. నా పేరు సూర్య డిజాస్ట‌ర్స్. ఇప్పుడు శైల‌జారెడ్డి అల్లుడు కూడా ఓపెనింగ్స్ వ‌ర‌కు ఓకే అనిపించి ఆ త‌ర్వాత మ‌ళ్లీ చేతులెత్తేసింది. దాంతో ఇప్పుడు అను ఎమ్మాన్యువ‌ల్ కెరీర్ కు ఎవ‌రు హిట్ ఇస్తారో అర్థం కావ‌డం లేదు. క‌చ్చితంగా ఇప్పుడు ఈ శైల‌జారెడ్డి కూతురుకు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. పైగా ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సెంటిమెంట్స్ ను దారుణంగా న‌మ్మే ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికిప్పుడు అనుకు అవ‌కాశం ఇచ్చే వాళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. ఈ బ్యూటీ ఏం చేస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here