అనుప‌మ‌.. నిల‌వ‌దే మ‌ది నిల‌వ‌దే..!


ఆ మ‌ధ్య అనుప‌మ అందాన్ని చూసి నిల‌వ‌దే మది నిల‌వ‌దే అంటూ పాట రాసాడు రామ‌జోగ‌య్య శాస్త్రి. నిజంగానే ఇది నిజ్జం. ఈమె సొగ‌సును చూస్తూ ఒక‌చోట నిల‌బ‌డ‌టం చాలా క‌ష్టం. అలాగ‌ని అందాల ఆర‌బోత‌తో ముంచేయ‌దు.. ఇంకా మాట్లాడితే క‌నీసం న‌డుము కూడా చూపించ‌దు. కానీ చూపించ‌కుండానే చంపేస్తుంది. అది కూడా కేవ‌లం చూపుల‌తో.
ఇప్పుడు కూడా ఇదే చేసింది అనుప‌మ‌. తాజాగా ఓ ఫోటోషూట్ చేసి అందులో త‌న చూపుల‌తోనే మాయ చేస్తుంది అనుప‌మ‌. హిట్టు ఫ్లాపుల‌తో ప‌నిలేకుండా ఈ భామ‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పైగా గ్లామ‌ర్ షో చేయ‌ద‌నే మాటే కానీ.. దాచేసిన అందాలు దోర‌గా చూపించ‌డంలో అనుప‌మ త‌ర్వాతే ఎవ‌రైనా..! అప్ప‌ట్లో శ‌త‌మానం భ‌వ‌తి స‌క్సెస్ మీట్ లో ఎర్ర‌టి చీర‌లో అందాలు ఎలా చూపిస్తే కెమెరాల‌కు చూసే వాళ్ల గుండెల‌కు గుచ్చుకుంటాయో తెలుసుకుని మ‌రీ రెచ్చ‌గొట్టింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.
ఇక ఆ త‌ర్వాత కూడా ప్ర‌తీ వేడుకకు ఊరించే అందాల‌నే చూపించ‌కుండా కెమెరాకు ఎరేసింది అనుప‌మ‌. ఇప్పుడు ఇదే చేసింది. తాజాగా ఓ ఫోటోషూట్ లో అందాల‌న్నీ దాచేసి మ్యాజిక్ చేసింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. కొంటె చూపుల‌తో కెమెరాల‌కు చిక్కిన అనుప‌మ అందాలు అద్భుత‌హః అనిపిస్తున్నాయి. మొత్తానికి గ్లామ‌ర్ షో చేయ‌కుండానే చూపుల‌తో ఉరేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈమె గానీ అందాల ఆర‌బోత మొదలెడితే కుర్రాళ్లు నిద్ర‌లు కూడా పోరేమో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here