అనుకు యాసిడ్ టెస్ట్.. మెగా హీరోనే దిక్కు..!

Anu Emmanuel Launch B New Mobile Store At Yemmiganur

అంతే.. ఇండ‌స్ట్రీలో అంతే.. జాత‌కం తిర‌గ‌బ‌డానికి.. నిల‌బ‌డ‌టానికి ఒక్క సినిమా చాలు. అను ఎమ్మాన్యువ‌ల్ నే తీసుకోండి. మొన్న‌టి వ‌ర‌కు ఈ భామ పేరు మారుమోగిపోయింది. కానీ ఏం చేస్తాం.. ఆశ‌లు పెట్టుకున్న ఆక్సీజ‌న్ కొంప ముంచేసింది. అప్పుడు కూడా ఆమె భ‌య‌ప‌డ‌లేదు. ఎందుకంటే ప‌వ‌న్ ఉన్నాడు.. త‌న కెరీర్ ను నిల‌బెడ‌తాడు అని న‌మ్మింది. కానీ అజ్ఞాత‌వాసి అను కెరీర్ ను పూర్తిగా అజ్ఞాతంలోకి నెట్టేసాడు. ఇక ఇప్పుడు ఈమె ఆశ‌ల‌న్నీ నా పేరు సూర్య‌పైనే ఉన్నాయి. బ‌న్నీ లాంటి స్టార్ హీరో సినిమా కావ‌డంతో ఈ భామ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఫోటోషూట్ల‌లో రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి. పైగా సినిమాల్లోనూ అమ్మాయి గారు ఫుల్ గా రెచ్చిపోతారు. అందాల ఆర‌బోత‌కు ఎలాంటి అడ్డంకులు లేక‌పోవ‌డంతో అను ఎమ్మాన్యువ‌ల్ కు ఫ్లాపులు ఉన్నా కూడా నువ్వే అర‌కొర అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నా పేరు సూర్య‌లో న‌టిస్తున్న అను.. త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో మారుతి తెర‌కెక్కిస్తోన్న శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో ఎంపికైంది. ఈ చిత్రంలో అనుకు అవ‌కాశం రావ‌డానికి కార‌ణం త్రివిక్ర‌మ్ అని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో తాను తెర‌కెక్కించ‌బోయే సినిమాలోనూ అను ఎమ్మాన్యువ‌ల్ నే హీరోయిన్ గా తీసుకోవాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్. అజ్ఞాత‌వాసి టైమ్ లోనే అను వ‌ర్క్ మెచ్చిన మాట‌ల మాంత్రికుడు.. వ‌ర‌స‌గా అవ‌కాశాలిస్తున్నాడు. వీటన్నింటికీ నిర్మాత రాధాకృష్ణ కావ‌డంతో ప‌ని సులువైపోయింది. మొత్తానికి ఇప్పుడు నాగ‌చైత‌న్య‌.. బ‌న్నీ సినిమాలు ఆడితే కానీ అనుకు మంచి రోజులు రాన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here