అఖిల్ మూడో సినిమా ద‌ర్శ‌కుడు క‌న్ఫ‌ర్మ్.. 

Akkineni Akhil’s ‘Hello’ shoot wrapped up

ఒక్కోసారి మ‌నం చేసే ప‌నులు క‌లిసి రాక‌పోవ‌చ్చు. కానీ ఆ ప‌నుల‌తో మ‌నం ఇక‌పై చేయాల‌నుకుంటున్నాం అనే విష‌యంపై మాత్రం క్లారిటీ వ‌స్తుంది. ఇప్పుడు అఖిల్ విష‌యంలో హ‌లో ఇదే మేలు చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు. క‌మ‌ర్షియ‌ల్ గా డిజాస్ట‌ర్ అయింది. కానీ హ‌లో త‌ర్వాత అఖిల్ కెరీర్ కు మాత్రం ఓ క్లారిటీ వ‌చ్చింది. ఏం చేయాలో తెలుస్తుంది మ‌నోడికి ఇప్పుడిప్పుడే. త‌న నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అర్థం చేసుకున్నాడు. యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ అంటే ప్రేక్ష‌కులు నో చెప్పేసారు.. కానీ ప్రేమ అన్న‌పుడు ఓకే అన్నారు. విజ‌యం నాని ప‌ట్టుకెళ్లిపోయినా గుర్తింపు అయితే ఇచ్చారు. అందుకే ఇప్పుడు హ‌లో త‌ర్వాత మ‌రోసారి ప్రేమ క‌థ‌నే న‌మ్ముకుంటున్నాడు అక్కినేని వార‌సుడు. అఖిల్ మూడో సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అఫీషియ‌ల్ స‌మాచారం రాలేదు. ఆ మ‌ధ్య స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టితో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది కానీ ఇప్ప‌టికీ దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు అఖిల్.
ఇప్పుడు సుకుమార్ తో సినిమా ఉంటుందని వార్త‌లొచ్చాయి. కానీ అది కూడా అబ‌ద్ధ‌మే. కానీ ఇప్పుడు మాత్రం క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చేసింది. తొలిప్రేమ‌తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న వెంకీఅట్లూరితో అఖిల్ మూడో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాపై ద‌ర్శ‌క నిర్మాత‌ల కన్ఫ‌ర్మేష‌న్ రాక‌పోయినా క్లారిటీ అయితే వ‌చ్చింది. ఇప్ప‌టికే వెంకీ చెప్పిన క‌థ అఖిల్ కు న‌చ్చ‌డం.. చేస్తాన‌ని చెప్ప‌డం కూడా జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ క‌థ‌పైనే కూర్చున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మే నుంచి ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. మొత్తానికి హ‌లోతో ప్రేమ మూడ్ లోకి వ‌చ్చిన అఖిల్.. తొలిప్రేమ‌తో అదే మూడ్ లో ఉన్న వెంకీ అట్లూరి.. ఇద్ద‌రూ క‌లిసి ఇండ‌స్ట్రీని ఎలాంటి ప్రేమ‌లో ముంచేస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here