తాజా వార్తలు ఫీచర్ న్యూస్

అక్కినేని హీరో ‘జున్ను’ ప్రత్యేకతలు 

Date: April 21, 2017 10:36 am | Posted By:
అఖిల్ రెండో సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉండనున్నాయి. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘జున్ను’ అనే టైటిల్ పెట్టారు. ఇంటర్నేషనల్ స్టంట్స్ మాన్ బాబ్ బ్రౌన్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఇటీవల, హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు....

akhil

అఖిల్ రెండో సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉండనున్నాయి. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘జున్ను’ అనే టైటిల్ పెట్టారు. ఇంటర్నేషనల్ స్టంట్స్ మాన్ బాబ్ బ్రౌన్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఇటీవల, హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఒక సినిమా హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర తెరకెక్కించడం ఇదే మొదటి సారి. కాబట్టి, అఖిల్ సినిమా ద్వారా మెట్రో పరిచయమవుతోంది. యంగ్ హీరో ట్వీట్ చేస్తూ “మొదటి యూనిట్ సక్సెస్ఫుల్ గా మెట్రో దగ్గర షూట్ జరుపుకుందని మానేజ్మెంట్ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. దీన్ని హైదరాబాద్ లో చూడడం అందంగా ఉందని” అఖిల్ అన్నాడు. మనం మరియు 24 ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ని డైరెక్ట్ చేస్తున్నారు. అఖిల్ సరసన మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. 

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY