అందాల నిధి.. ఊరిస్తుంది మ‌ది..

ఇండ‌స్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వ‌స్తుంటారు పోతుంటారు.. కానీ కొంద‌రు మాత్ర‌మే త‌మదైన ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు ఈ ముద్ర కోస‌మే ప్ర‌య‌త్నిస్తుంది నిధిఅగ‌ర్వాల్.

ఇప్పుడు ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ త్వ‌ర‌లోనే క‌చ్చితంగా ఫేమ‌స్ అవుతుంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది వ‌ర‌కే బాలీవుడ్ లో మున్నామైఖెల్ లో టైగ‌ర్ ష్రాఫ్ తో జోడీక‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. వ‌స్తూ వ‌స్తూనే త‌న టాలెంట్ అంతా చూపిస్తుంది. అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. రోజుకో విధంగా హాట్ హాట్ గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు. స‌వ్య‌సాచి విడుద‌ల‌కు ముందే క‌చ్చితంగా మ‌రో రెండు మూడు ఆఫ‌ర్లు ప‌ట్టేలా క‌నిపిస్తుంది నిధి అగ‌ర్వాల్. మ‌రి ఈ అందాల నిధిని అంత జాగ్ర‌త్త‌గా కాపాడుకునే హీరోలు ఎవ‌రో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here