అందాల నిధికి తాళం ఎప్పుడు వేస్తుందో..?

సెలెబ్రెటీ లైఫ్ అంటే తెరిచిన పుస్త‌కం అంటారు కానీ మ‌రీ ఇంత‌గా తెరిచిన పుస్త‌కం అని ఎవ‌రూ ఊహించ‌లేదు. సోకుల తాళం పోగొట్టుకుందో ఏమో కానీ ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్ తో మ‌తులు చెడగొడుతూనే ఉంటుంది నిధి అగ‌ర్వాల్. క‌నీసం తొలి సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఆగ‌డం లేదు ఈ భామ‌. ఇప్ప‌టికే తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది నిధి. ఇప్పుడు కూడా మ‌రోసారి హాట్ ఫోటోస్ తో పిచ్చెక్కింది ఈ బ్యూటీ.

NIDHI-AGARWAL

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి.. అఖిల్ మూడో సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. ఇది వ‌ర‌కే బాలీవుడ్ లో మున్నామైఖెల్ లో టైగ‌ర్ ష్రాఫ్ తో జోడీక‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తూ వ‌స్తూనే త‌న టాలెంట్ అంతా చూపిస్తుంది.
అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. రోజుకో విధంగా హాట్ గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు.

స‌వ్య‌సాచి విడుద‌ల‌కు ముందే అఖిల్ మూడో సినిమాలో ఆఫ‌ర్ అందుకుంది నిధి. ఇక ఇప్పుడు ఈ భామ గురించి ఇత‌ర హీరోలు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి అక్కినేని హీరోల‌కు తోడు అందాల ఆర‌బోత కూడా ఈ భామ‌కు క‌లిసొస్తుంది. ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ ను పూర్తిగా మ‌ర్చిపోయి టాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయేలా క‌నిపిస్తుంది. మ‌రి మ‌న హీరోల నుంచి కూడా ఇంతే ఆద‌ర‌ణ ఉంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here